ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామంలో శుక్రవారం దొంగలు రెచ్చిపోయారు. ఇంటి యజమాని లేని సమయాన్ని చూసి ఓ ఇంటిలోకి చొరబడ్డ దొంగలు బీరువాను పగలగొట్టి అందులో ఉన్న నగదు, బంగారాన్ని దోచుకు వెళ్లారు. ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఎంత మొత్తంలో నగదు బంగారం పోయిందో పోలీసులు విచారణలో వెల్లడిస్తామని తెలిపారు.