ఈరోజు వాల్మీకీమహర్షి జయంతిని, దరిశిలోని స్థానిక పొదలిరోడ్డులోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర హాస్టల్ ఆవరణలో ఘనంగా జరుపుకున్నారు.ముందుగా ఈ కార్యక్రమంలో వాల్మీకీ మహర్షికి పూలమాల వేసి,పుష్పాంజలి ఘటించి ఘనమైన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది గడ్డి శ్రీనివాసులు ,మానవత స్వచ్ఛంద సేవాసంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి,ఉపాధ్యాయులు ఉప్పుటూరి సురేష్ బాబు, మీనిగ శ్రీనివాసులు, ఎన్వీ.బాలసుబ్రమణ్యం,హాస్టల్ సిబ్బంది,విద్యార్థులు పాల్గొని మిఠాయిలు పంచుకున్నారు.