నకిలీ మద్యం కేసు.. రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ.. ఎవరి పేర్లు బయటకు వస్తాయో?
ఏపీలో సంచలనం రేపిన ములకలచెరువు నకిలీ మద్యం కేసులో పోలీసులు దర్యాఫ్తును వేగవంతం చేశారు. ఈ కేసులో కింగ్ పిన్ జనార్ధన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సౌతాఫ్రికా నుంచి విజయవాడ వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు గన్నవరం ఎయిర్ పోర్టులో కాపు కాసి జనార్దన్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు జనార్ధన్ రావును గన్నవరం విమానాశ్రయం నుంచి రహస్య ప్రదేశానికి తరలించారు పోలీసులు. అక్కడ అతడిని విచారిస్తున్నారు. కాగా, జనార్ధన్ రావు నోరు విప్పితే మరికొందరు నాయకుల పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటివరకు 23మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.