సిపిఆర్ చేసి ప్రాణం కాపాడిన కనిగిరి సీఐ షేక్ ఖాజావలి
కనిగిరి కాస్మోపాలేట్ క్లబ్ నందు టెన్నిస్ ఆడుతున్న కనిగిరి పిఎసిఎస్ అధ్యక్షులు అద్దంకి రంగబాబు అకస్మాత్తుగా కళ్ళు తిరిగి కిందపడిపోయారు. అదే సమయంలో అక్కడే టెన్నిస్ ఆడుతున్న కనిగిరి సీఐ ఖాజావలి ఈ ఘటనను గమనించి వెంటనే స్పందించారు. ప్రాథమిక వైద్య పరమైన చర్యగా సిపిఆర్ ( కార్డియోపల్మనరీ రిససిటేషన్) చేయటంతో ప్రాణాపాయం తప్పింది.
ఈ ఘటనను చూసిన సభ్యులు మరియు టెన్నిస్ పక్కనే ఉన్న కాస్మోపాలిటీ సభ్యులు మరియు టెన్నిస్ క్రీడాకారులు మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ తన కారులో వెంటనే అందరు కలిసి సమీపoలోని హాస్పిటల్ నందు చేర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ సరైన సమయంలో తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. ఇలానే ప్రతి ఒక్కరు సి పి ఆర్ పి పైఅవగాహన కలిగి ఉండాలని డాక్టర్ కిరణ్ తెలిపారు. కనిగిరి సీఐ షేక్ ఖాజావలి మాట్లాడుతూ త్వరలో జర్నలిస్టుల అందరితో సమావేశం ఏర్పాటు చేసి అందరికీ సిపిఆర్ మీద అవగాహన కల్పిస్తానని ,ఎవరైనా కానీ ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటే ఆ సమయంలో సి పి ఆర్ చేసి ప్రాణాపాయం పరిస్థితులను నుండి కాపాడవచ్చు అని సిఐ ఖాజావలి తెలిపారు.