కిడ్నాపైన బాలుడి జాడను గంటలో చేదించిన గుంటూరు పోలీసులు
పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని RTC కాలనీకి చెందిన షేక్.షాఫిఉల్లా నిన్న(ది.26.10.2025) మద్యాహ్నం సుమారు 01:00 గంట నుండి తన మూడు(03) సంవత్సరాల బాబు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, వెంటనే సీఐ వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో Cr.No. 319/2025 u/s 140(2) BNS of Old Guntur సెక్షన్ కింద కిడ్నాప్ కేసు నమోదు చేసి, సదరు విషయాన్ని గౌరవ జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ కి తెలియపరచి, ఆయన ఈ కేసుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, తక్షణమే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చేపట్టాలని ఆదేశించగా, కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాబుని కిడ్నాప్ చేసినాహులను ఈ రోజు ఉదయం 08.00 గంటలకి గుంటూరు బస్టాండ్ వద్ద అరెస్ట్ చేసి ఆమె వద్ద నుండి బాబుని సురక్షితంగా రక్షించి, అతని తల్లిదండ్రులకు అప్పగించడమైనది.నిందితురాలైన షకీలాని రిమాండ్ నిమిత్తం కోర్ట్ కి హాజరుపరచడమైంది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... సకాలంలో పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల త్వరితగతిన చర్యలు తీసుకోగలిగామని, తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత పట్ల జాగ్రత్త వహించాలని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత మరియు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా మీ పిల్లలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
తమ బిడ్డ అపహరణకు గురైన వెంటనే ఆందోళనతో, భయంతో ఉన్న సమయంలో కేవలం గంటల వ్యవధిలోనే వారి బాబునీ తల్లి దండ్రులు రక్షించి,అప్పగించారని పాత గుంటూరు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
గుంటూరు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో పాత గుంటూరు పోలీసులు చూపిన ప్రత్యేక చొరవ, చేసిన ప్రయత్నాలు వెలకట్టలేనివని, మా బిడ్డను సురక్షితంగా రక్షించిన పోలీసు శాఖకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని తల్లిదండ్రులు పేర్కొన్నారు.
బాబును రక్షించుటలో అత్యంత ప్రతిభ కనపరిచిన ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ ని, పాత గుంటూరు సిఐ-కె.వెంకట ప్రసాద్ ని , యస్.ఐ-యన్.సి. ప్రసాద్ మరియు సిబ్బంది HC నూరుద్దీన్ ,PC రాజశేఖర్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినారు.