ఏపీ లోని రైల్వే ప్రాజెక్టుల పురోగతి పై ముఖ్యమంత్రి సమీక్ష.
రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పనుల పురోగతిపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రూ.33,630 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయి. కొత్త రైల్వేలైన్లు, అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి, రైల్వే ఓవర్, అండర్ బ్రిడ్జిల నిర్మాణాలకు సంబంధించి రైల్వేశాఖకు ప్రతిపాదనలు పంపడం, నడికుడి-శ్రీకాళహస్తి, గుంటూరు- గుంతకల్, గుణదల ముస్తాబాద్ బైపాస్, రాయదుర్గ్- తుముకూరు మధ్య రైల్వేలైన్ ప్రాజెక్టుల పురోగతి సమీక్షలో ప్రస్తావనకు వచ్చాయి. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులు, దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీ సంజయ్ శ్రీవాస్తవ, తూర్పు, దక్షిణ కోస్తా రైల్వే అధికారులు పాల్గొన్నారు.