మంగళవారం తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుడ్లూరు మండలం పొట్లూరు–గుడ్లూరు మధ్య రాళ్లవాగు వంతెనపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ప్రజలు ఆ మార్గం గుండా ప్రయాణించవద్దని ఎస్ఐ వెంకట్రావు హెచ్చరిక జారీ చేశారు. దీంతో కందుకూరు–కావలి రహదారి పై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగులు, వంతెనలు దాటే ప్రయత్నాలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.