తుఫాను వేళ కురిచేడు మండలంలో పర్యటించిన డా||గొట్టిపాటి లక్ష్మి
మొంథా తుఫాన్ ప్రభావంతో కురిచేడు మండలంలోని వీరయపాలెం పంచాయతీ పరిధిలోని వెంగాయపాలెం ఎన్ఎస్పీ కాలనీలో పొలాల నుండి నీరు ఆర్ & బి రోడ్డుపైకి చేరిన నేపథ్యంలో,
డా|| గొట్టిపాటి లక్ష్మీ గారు స్వయంగా ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆర్ & బి డీఈ గోపికృష్ణ, సంబంధిత అధికారులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని డా|| లక్ష్మీ గారు అధికారులకు సూచించారు.