తుఫాన్ నష్టాలపై కలెక్టర్‌కి నివేదిక సమర్పించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
తుఫాన్ బీభత్సంతో ధ్వంసమైన రహదారులు, కాలువల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయాలని దర్శి టిడిపి ఇన్‌ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి జిల్లా కలెక్టర్ రాజబాబును కోరారు.ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్‌తో కలిసి ఆమె తుఫాన్ కారణంగా జరిగిన ఆస్తి, పంటనష్టాలపై నివేదిక అందజేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
దర్శి ప్రాంతంలో విపత్తును సమర్థంగా ఎదుర్కొన్న అధికారుల కృషిని డాక్టర్ లక్ష్మి ప్రశంసించారు.