ఏపీలో కొత్త జిల్లాలు.. మంత్రివర్గ ఉపసంఘం కీలక భేటీ..
ఏపీలో జిల్లాల పునర్విభజనపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, రామానాయుడు, హోంమంత్రి అనిత, బీసీ జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు. మంత్రులు సత్యకుమార్ యాదవ్, నారాయణ వర్చువల్ గా పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంత్రివర్గ ఉప సంఘం చర్చిస్తోంది. దీనిపై నిర్ణయం తీసుకుని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నారు