కార్తీక పౌర్ణమి మహిళల కోలాటం లో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
కార్తీక పౌర్ణమి సందర్భంగా తాళ్లూరు మండలం, తురకపాలెం గ్రామం లో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన మహిళల కోలాటం ప్రదర్శన లో ముఖ్య అతిధులు గా దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - లలిత్ సాగర్ పాల్గొన్నారు.
ఈసందర్బంగా కోలాటం ప్రదర్శించి న 40 మంది మహిళలకు డా|| లక్ష్మీ చీరలు పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమం లో తురకపాలెం గ్రామ టిడిపి నాయకులు, తాళ్లూరు మండలం లోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.