No.1 Short News

Newsread
రాజమండ్రిలో హోమియోపతి వైద్యుడికి ఘన సన్మానం
రాజమండ్రి (దివాన్ చెరువు): హోమియోపతి వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ వైద్యుడు డాక్టర్ మొహమ్మద్ జిలానిను ఒక హిందూ సోదరుడు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. డాక్టర్ జిలాని గారు అనేక సంవత్సరాలుగా వైద్యాన్ని వృత్తిగా కాకుండా సేవగా భావిస్తూ, కులమత భేదాలు లేకుండా ప్రజలకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ గ్రామంకు చెందిన ఓ వ్యక్తి, కుటుంబ కలహాల నేపథ్యంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, అతడిని రాజమండ్రికి తరలించి డాక్టర్ జిలాని గారి వద్ద చికిత్స అందించగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన ఆయన వైద్య ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. ఇదే కాకుండా, తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన అల్లుడినే స్వయంగా చికిత్స చేసి బ్రతికించిన ఘటన కూడా ఆయన సేవాభావాన్ని చాటుతోంది. ఈ సందర్భంగా డాక్టర్ జిలాని గారి మనవడు, సామాజిక కార్యకర్త సయ్యద్ సలీం మాట్లాడుతూ, “మా తాతయ్య గారు వైద్యాన్ని జీవిత ధర్మంగా భావించి సేవ చేశారు. ఆయనకు లభించిన ఈ గౌరవం సమాజానికి గర్వకారణం” అని తెలిపారు.
03 Dec 2025 07:54 AM
2
67






😔
Oops! You're offline.
It looks like you've lost your internet connection.
Please check your network and try again.

Find News

News Categories

  • All Categories
  • Jobs (7)
  • Latest News (845)
  • Motivation (11)
  • Crime News (26)
  • Local Ads (39)
  • Entertainment (15)
  • Local Updates (220)
  • Sports News (12)
  • Education (13)
  • Business Promotions (1)
  • Politics (67)
  • Breaking News (97)
  • Install App
    Select Location
    | newsread.in

    Newsread
    For better experience and daily news update.
    Download our app from play store.