

No.1 Short News
Newsreadవర్షాకాలంలో ఈ కూరగాయలను అస్సలు తినకండి.. ఎందుకో తెలుసా?
వర్షాకాలంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో వ్యాధులు సులబంగా వ్యాప్తి చెందుతాయి. అలాగే వ్యాధులు రావడానికి ప్రధాన కారణం ఆహరం కూడా. అందుకే, వర్షాకాలంలో తీసుకునే ఆహరం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. కొన్ని రకాల ఆహారాలను, కూరగాయలను ఈ వర్షాకాలంలో తినకపోవడమే మంచిదని చెప్తున్నారు. మరి ఆ కూరగాయలు ఏంటి? వాటిని ఎందుకు తినకూడదు? తింటే ఏమవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాకాలంలో తినకూడని కూరగాయలు:
1.బీరకాయ, సొరకాయ:
ఈ తరహా కూరగాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇవి వర్షాకాలంలో త్వరగా పాడవుతాయి. అలాగే బాక్టీరియా, ఫంగస్ త్వరగా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రకం కూరగాయల్లో ఏది మంచిది. ఏది పాడైంది అని గుర్తించడం చాలా కష్టం. అందుకే వర్షాకాలంలో ఈ కూరగాయలను తక్కువగా తీసుకోవడం మంచిది.
2.ముల్లంగి:
ముల్లంగి భూమిలోపల పెరిగే కూరగాయ. వర్షాకాలంలో ఇలా మట్టి నుంచి వచ్చే కూరగాయల్లో సూక్ష్మజీవులు, బాక్టీరియా, పరాన్నజీవులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇవి మన శరీరంలో చేరి జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు.
3.పచ్చి కూరగాయలు:
వర్షాకాలంలో పచ్చిగా ఉండే కూరగాయలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నీరు, తడి వాతావరణం వల్ల బాక్టీరియా వేగంగా పెరుగుతుంది. కాబట్టి సరిగా శుభ్రం చేయకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇది చర్మ సమస్యలకు కారణం కావచ్చు.
4. ఆకు కూరలు:
నిజానికి మనిషి ఆరోగ్యానికి ఆకు కూరలు చాలా మంచిది. కానీ, వర్షాకాలం మాత్రం వీటికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే, ఈ కాలంలో ఆకు కూరలపై మట్టితో పాటు ఫంగల్ స్పోర్లు ఉండే అవకాశం ఉంటుంది. వాటి వల్ల ఇన్ఫెక్షన్లు రావచ్చు. సరిగ్గా శుభ్రపరచకపోతే వాంతులు, విరేచనాలు లాంటి సమస్యలు రావచ్చు. అయినా సరే తినాలని అనుకుంటే మాత్రం బాగా ఉడికించి తినాలి.
5.మష్రూమ్స్:
ఇవి వర్షాకాలంలోనే ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ఇవి చాలా త్వరగా పాడవుతాయి. వాటిని గుర్తించకపోవడం వల్ల అవి విషపూరితంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి వర్షాకాలం మష్రూమ్స్ తినడం మంచిది కాదు.
కూరగాయల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
నీటి శాతం తక్కువగా ఉండే కూరగాయలను ఎంచుకోవాలి.
ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు.
బాగా ఉడికించి లేదా వేడిగా ఉండే ఆహారంగా తీసుకోవాలి.
రంగు మారిన కూరగాయలు తినకూడదు.
వర్షాకాలంలో శరీరం సహజంగానే కొంత బలహీనంగా ఉంటుంది. పైగా తడి వాతావరణం, వైరస్‌లు, బ్యాక్టీరియా అనారోగ్యాలకు గురి చేస్తాయి. అందుకే కొన్ని కూరగాయలు తినడాన్ని తాత్కాలికంగా నివారించడం మంచిది. దీనివల్ల ఆరోగ్యం బాగుండే అవకాశం ఉంటుంది.
Latest News
30 Jun 2025 13:56 PM