

No.1 Short News
Newsreadఏపీ ప్రజలకు శుభవార్త.. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు...పన్ను చెల్లింపు వాట్సాప్‌తో చాలా ఈజీగా
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
వాట్సాప్‌లో పన్నులు చెల్లించొచ్చు
పన్నుల చెల్లింపు మరింత సులువు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఆస్తి పన్నులు చెల్లించేందుకు ఆఫీసులు, మీ సేవల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇకపై చాలా ఈజీగా ఆస్తిపన్ను చెల్లించే అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం వాట్సప్ మనమిత్ర ద్వారా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా గ్రామ పంచాయతీల్లో స్మార్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.. ఆస్తి పన్ను, నీటి కుళాయి బిల్లులు, వ్యాపార లైసెన్స్ ఫీజులు వంటివి ఇకపై స్మార్ట్‌ఫోన్ నుంచే చెల్లించొచ్చు. దీనివల్ల చాలామందికి వారి సొంత ఊళ్లలోని ఆస్తుల పన్నులు చెల్లించడం సులభతరం అవుతుంది. అలాగే పంచాయతీల్లో జరిగే అవినీతిని కూడా అరికట్టవచ్చు అంటున్నారు.
ప్రతి ఏటా పంచాయతీల ద్వారా రూ.822.46 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది.. గతంలో కొన్ని సందర్భాల్లో కొందరు సిబ్బంది డబ్బులు వసూలు చేసి రికార్డుల్లో మాత్రం నమోదు చేయడం లేదు. ఇలాంటి అక్రమాలను అరికట్ట