

No.1 Short News
Newsreadఈరోజు నుంచి మారనున్న రైల్వే తత్కాల్ టికెట్ రూల్స్
ఈ రోజు నుంచి మారనున్న రైల్వే తత్కాల్ టికెట్ రూల్స్
జులై 15 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి కానుంది. ఐఆర్ సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసేటప్పుడు ఓటీపీ ద్వారా ఆధార్ ధృవీకరణ చేయాలి. ఏజెంట్లు టికెట్లను బుకింగ్ ప్రారంభమైన అరగంట తర్వాతే బుక్ చేయాల్సి ఉంటుంది. స్టేషన్ కౌంటర్లలోనూ ఆధార్ అవసరం. ఇది దళారుల మోసాలను అడ్డుకునేందుకు రైల్వే తీసుకున్న నిర్ణయం. ఆధార్ లింక్ చేయని మొబైల్ నంబర్లకు ఓటీపీ రాకపోతే, 139 లేదా 1947ను సంప్రదించాలి.
Latest News
15 Jul 2025 09:38 AM