No.1 Short News

Newsread
ఇంటింటికి విద్యుత్తు కూటమి ప్రభుత్వ ద్వేయం: డాక్టర్ కడియాల లలిత్ సాగర్.
విద్యుత్ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం సోలార్ విద్యుత్ గుర్తించి గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ సహకారంతో ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ను అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం లో భాగంగా ప్రతి ఇంటికి సౌర విద్యుత్తు ఏర్పాటు చేసుకోవాలని టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ కోరారు. బుధవారం దర్శి లోని తన నివాసంలో ఏర్పాటుచేసిన సోలార్ సౌరశక్తి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి ఇంట్లో విద్యుత్తు ఖర్చును తగ్గించుకోవచ్చని ఆయన తెలిపారు. విద్యుత్ సౌరశక్తి పలకల ఏర్పాటుకు ప్రభుత్వం 25% సబ్సిడీస్తుందని మిగిలిన మొత్తం రుణం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. మీ ఇంటి అవసరాలకు వాడుకొని మిగిలిన విద్యుత్తును అమ్ముకొని కూడా లాభం పొందవచ్చు అన్నాను. 25 ఏళ్ల పాటు విద్యుత్తును వాడుకునే అవకాశం ఉందని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం డా || లలిత్ గారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, సోలార్ ప్లాంట్ ELLVIN ENERGY కంపెనీ MD విజయ భాస్కర్, విద్యత్ శాఖా DE శ్రీనివాస్ దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, నియోజకవర్గం లోని మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్లు, యూనిట్ & బూత్ ఇంచార్జి లు, వివిధ హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Local Updates
16 Jul 2025 20:12 PM
2
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.