

No.1 Short News
Newsreadమానవత సంస్థ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం
దరిశి పట్టణంలో, గత సంవత్సరం మానవత స్వచ్ఛంద సేవాసంస్థను ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్.రామచంద్రారెడ్డి ఆధ్వర్యాన స్థాపించడం జరిగింది. నేటికి సంవత్సరం అయిన సందర్భంగా నేడు నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమం డి.వెంకటరెడ్డి అధ్యక్షతన, ముఖ్య అతిధులుగా సీహెచ్సీ మెడికల్ అధికారి సుమన్,ఎమ్యీవోలు రఘురామయ్య, రమాదేవి,ఆ సంస్థ జల్లా పరిశీలకులు యల్లమందారెడ్డి సంస్థనుద్దేశించి ప్రసంగించారు. ఈ సమావేశంలో ముందుగా, ఇప్పటివరకూ కన్వీనరుగా వ్యవహరించిన కపురం శ్రీనివాసరెడ్డిని, ప్రస్తుత మరియూ కొత్త పాలకమండలి సభ్యులందరూ సభాముఖంగా యావన్మంది సమక్షంలో ఏకగ్రీవంగా మానవత సంస్థ ప్రకాశం జిల్లా డైరెక్టర్ గా ఎంపిక చేయడం జరిగింది. తదుపరి నూతన కార్యవర్గ సభ్యులచే సంస్థ పరిశీలకులు యల్లమందారెడ్డి అందరిచేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముందుగా నటరాజ నృత్యకళా నిలయం వారిచే చిన్నారులచే సనాతన సాంప్రదాయాలను గౌరవిస్తూ కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి అందరినీ అలరించారు. నూతన కమిటీలో చైర్మన్ దేవతి ప్రసాదు, కో చైర్మన్ వాకా జనార్ధన్ రెడ్డి, కన్వీనర్ దనిరెడ్డి వెంకటరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చీదెళ్ళ బసవయ్య, సహాధ్యక్షులు అడపాల గణేష్, ప్రధాన కార్యదర్శి గొర్రెపాటి వేణు,కోశాధికారి చింతా తిరుపతిరెడ్డి వున్నారు. గౌరవ అధ్యక్షుడిగా రాజేశ్వర్ రెడ్డి, ఈసీ మెంబర్లుగా కార్యవర్గ మస్తాన్,ఎన్వీ సుబ్బారెడ్డి,జే.సుశీలమ్మ,రోషారావు,వాసుదేవరెడ్డి,అన్నవరపు వెంకటేశ్వర్లు,మస్తాన్ నాయక్, మోషే,శేషారావు,ఎసెన్స్ సుబ్బారావు,జైహింద్ రెడ్డి, లీగల్ అడ్వైజరీ కమిటీ చీఫ్ గడ్డి శ్రీనివాసులు(లాయర్),మీడియా ప్రతినిధుల సంఘం తరుపున ఆర్.రామకోటిరెడ్డి లు ఉన్నారు.
Local Updates
17 Jul 2025 16:06 PM