

No.1 Short News
Newsreadబాధల్లో ఉన్న వారిని అక్కున చేర్చుకోవడమే మానవత సంస్థ ధ్యేయం: కపురం
దరిశిలోని స్థానిక లంకోజనపల్లిరోడ్ నందు నివాసముండే మూలే కుమారి ఇటీవల భర్త కీ.శే.మూలే రఘురామిరెడ్డి గారిని కోల్పోయి, ఇద్దరు అమ్మాయిలతో కుటుంబ పోషణ భారమై హోటల్స్ నందు సర్వర్ గా పనిచేస్తూ తన ఇద్దరు పిల్లల్ని చదివించలేక,కుటుంబ భారం మోయలేక ఇబ్బంది పడుతున్నది. ఆమె పరిస్థితిని యాదృచ్ఛికంగా చూసి చలించిపోయిన దరిశి మానవత స్వచ్ఛంద సేవాసంస్థ సభ్యులు మానవతా ధృక్పదంతో వారిని పిలిపించి పిల్లల చదువులు కొనసాగించుటకు,వారి అవసరాల కొరకు మానవత సంస్థ తరుపున 5000/-రూపాయలు, దాతల సహకారంతో 10516/- రూపాయలు వెరసి ₹.15516/- (పదిహేనువేల ఐదువందల పదహారు)రూపాయలను మానవత స్వచ్ఛంద సేవాసంస్థ ఛైర్మన్ దేవతి వరప్రసాద్,వైస్ ఛైర్మన్ వాకా జనార్దరెడ్డి,జిల్లా డైరెక్టర్ కపురం శ్రీనివాసరెడ్డి, కన్వీనర్ ధనిరెడ్డి వెంకటరెడ్డి, అధ్యక్షులు చీదెళ్ళ బసవయ్య,ప్రధాన కార్యదర్శి గొర్రెపాటి వేణు,కన్వీనర్ ధనిరెడ్డి వెంకటరెడ్డి, కోశాధికారి చింతా తిరుపతిరెడ్డి, A.గణేష్, SK.ఖాదర్ మస్తాన్,P.పెద్దిరాజు,CH.రోషారావు,J.సుశీల,R.రామకోటిరెడ్డి,L.వెంకటేశ్వర రెడ్డి,SNCH.సుబ్బారావు,N.వెంకటరావులు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
Local Updates
20 Jul 2025 16:34 PM