

No.1 Short News
Newsreadరామచంద్రాపురం లో చంద్రన్న పచ్చదనం కార్యక్రమం
చంద్రన్న పచ్చదనం కార్యక్రమం లో భాగంగా, మొక్కలు పంపిణీ కార్యక్రమం, దర్శి మండలం, రామ చంద్ర పురం గ్రామంలో,షేక్ 2nd ఖాసీం,నగరికంటి బుజ్జి బాబు ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రకాశం జిల్లా మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ, అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ కు మనమందరం తోడ్పాటు అందించాలి అని సురేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పచ్చదనం లో నిండి పోవాలని అన్నారు. చెట్ల వలన కలప కాయల, ఆహారం ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. కార్బన్ డయాక్సైడ్ తగ్గించి ఆక్సిజన్ పెంచడం చెట్లు వలనే సాధ్యం అని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో నారా చంద్రబాబు నాయుడు కృషి అభినందనీయం అని ఆయన తోడ్పాటు గా మనమందరం కూడా మొక్కలు నాటి రక్షించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖాసీం వలి, నాగర్ సాహెబ్, మొదలగు వారు పాల్గొన్నారు.
Local Updates
20 Jul 2025 16:37 PM