

No.1 Short News
Newsreadగుర్రం జాషువా రచనలు దేశానికి ఆదర్శం: శాస్త్రవేత్త వరప్రసాద్
దర్శి: ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్రదళితసేన, ప్రజా సంఘాలఆధ్వర్యంలో మహాకవి గుర్రం జాషువా54వర్ధంతిసభ కవలకుంట్ల గోవిందప్రసాద్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులు ఎంపీపీ గొల్లపాటి సుధారాణి ఆచార్యరంగ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త వరప్రసాద్, ఎంఈఓ రమాదేవి మాట్లాడుతూ గుర్రం జాషువా రచనలకు అప్పటి ప్రభుత్వాలు గండభేరన్యపేరణ్యం తొడిగి రచనలకు పట్టాభిషేకం చేసిన ఘనత గుర్రం జాషువాకు దక్కిందని ఈ సందర్భంగా కొనియాడిన్నారు. ఈ కార్యక్రమంలో సంఘసేవకులు జీవి రత్నం, రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గం గర్నపూడి ప్రేమ్ కుమార్, ఎమ్మార్పీఎస్ దర్శి నియోజకవర్గం ఇంచార్జ్ గoధం ఇర్మియ కొర్రలు తప్పిట డేవిడ్ తదితరులు పాల్గొన్నారు
Local Updates
24 Jul 2025 18:42 PM