

No.1 Short News
Newsreadరేపే దర్శి కి ముఖ్యమంత్రి. భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన ప్రకాశం ఎస్పీ దామోదర్
అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 2వ తేదీన దర్శి మండలం, తూర్పువీరాయపాలెం గ్రామానికి విచ్చేయుచున్న నేపథ్యంలో ముందస్తుగా భద్రతా ఏర్పాట్లను ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్, మరియు జిల్లా అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంగా హెలిప్యాడ్, వీఐపీ వాహనాల రాక-పోకలు, పార్కింగ్ ఏరియా, సీఎం ప్రవేశం, నిష్క్రమణ స్థలాలతో పాటు, హెలిప్యాడ్ నుండి ప్రజా వేదిక వరకు ఉన్న రూట్ మ్యాప్‌ను ఎస్పీ గారు స్వయంగా పరిశీలించారు. పర్యటన సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా మరియు బందోబస్తు, డ్రోన్ కెమెరాలు మరియు సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని,ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అన్ని చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అత్యంత పకడ్బందీగా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, సీఎం పర్యటన నిమిత్తం పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
జిల్లా ఎస్పీ వెంట దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ, ఒంగోలు డి.ఎస్.పి ఆర్ శ్రీనివాసరావు, మార్కాపురం డి.ఎస్.పి యు నాగరాజు, ఎస్పీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, దర్శి సీఐ రామారావు, త్రిపురాంతకం సీఐ అసాం మరియు సీఐలు, ఎస్ఐలు ఉన్నారు.
Latest News
01 Aug 2025 15:37 PM