No.1 Short News

Newsread
రేపే అన్నదాత సుఖీభవ.. ఈరోజు సాయంత్రం వరకు వారికి ఛాన్స్!
రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. రేపు రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులను జమ చేయనుంది. సీఎం చంద్రబాబు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రకాశం జిల్లాలో పథకాన్ని ప్రారంభించనున్నారు. రైతుల ఖాతాల్లో రేపు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 5000 రూపాయలు జమ కానుంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద మరో రెండు వేల రూపాయలను అందించనుంది. గత కొంతకాలంగా అన్నదాత సుఖీభవ పథకం పై పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ఎట్టకేలకు దానిపై క్లారిటీ వచ్చింది. రేపే కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సైతం నిధులు జమ చేసేందుకు నిర్ణయించింది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని వీరయ్యపాలెంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టునన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మూడు విడతల్లో సాయం.. పిఎం కిసాన్( pm Kisan ) ప్రతి ఏటా మూడు విడతల్లో అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రైతు ఖాతాలో ఏడాదికి ఆరువేల రూపాయలు జమ చేస్తోంది కేంద్రం. అయితే కేంద్రంతో పాటు మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ నిధులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి రెండు విడతల్లో రూ.5000, చివరి విడత రూ.4000 అందించనుంది. కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.6000, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.14000.. కలిపి 20 వేల రూపాయల మొత్తాన్ని అందించనున్నారు అన్నమాట. మొత్తానికి అయితే అన్నదాత సుఖీభవ పథకం విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది. రేపే రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. తప్పులు సరి చేసుకునే ఛాన్స్.. ఇప్పటికే సచివాలయాల్లో అర్హులైన రైతుల జాబితాను ప్రదర్శించారు. అయితే కొంతమంది రైతులు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. వారికి మరోసారి అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈరోజు సాయంత్రం వరకు తప్పులు సరి చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. ముఖ్యంగా ఆధార్( Aadhar) వివరాలు సరిగ్గా లేకపోవడంతో చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. లక్షల మంది రైతుల ఆధార్ కార్డు వివరాలు వెబ్ ప్లాంట్ లో ఉన్న వివరాలతో సరిపోలడం లేదు. పేర్లు తప్పుగా ఉండడం.. చనిపోయిన వారి పేర్లు తొలగించకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అన్నదాత సుఖీభవ పథకం అర్హులైన రైతులు నష్టపోకుండా చూడాలని సూచించింది. రైతుల వివరాల్లో తప్పులు ఉండడంతో తహసీల్దారుల లాగిన్లలో చాలా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ సాయంత్రం లోగా వాటిని క్లియర్ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. OkTelugu Home ఆంధ్రప్రదేశ్‌ Annadata Sukhibhava Scheme Latest Update: రేపే అన్నదాత సుఖీభవ.. ఈరోజు సాయంత్రం వరకు వారికి... ఆంధ్రప్రదేశ్‌వార్త విశ్లేషణ Annadata Sukhibhava Scheme Latest Update: రేపే అన్నదాత సుఖీభవ.. ఈరోజు సాయంత్రం వరకు వారికి ఛాన్స్! By Dharma Raj- శుక్రవారం, 1 ఆగస్ట్ 2025, 10:14 Annadata Sukhibhava Scheme Latest Update Annadata Sukhibhava Scheme Latest Update Annadata Sukhibhava Scheme Latest Update: ఏపీలో ( Andhra Pradesh) రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. రేపు రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులను జమ చేయనుంది. సీఎం చంద్రబాబు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రకాశం జిల్లాలో పథకాన్ని ప్రారంభించనున్నారు. రైతుల ఖాతాల్లో రేపు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 5000 రూపాయలు జమ కానుంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద మరో రెండు వేల రూపాయలను అందించనుంది. గత కొంతకాలంగా అన్నదాత సుఖీభవ పథకం పై పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ఎట్టకేలకు దానిపై క్లారిటీ వచ్చింది. రేపే కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సైతం నిధులు జమ చేసేందుకు నిర్ణయించింది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని వీరాయపాలెంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టునన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. Also Read: ఏపీలో వారికి పింఛన్లు కట్ మూడు విడతల్లో సాయం.. పిఎం కిసాన్( pm Kisan ) ప్రతి ఏటా మూడు విడతల్లో అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రైతు ఖాతాలో ఏడాదికి ఆరువేల రూపాయలు జమ చేస్తోంది కేంద్రం. అయితే కేంద్రంతో పాటు మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ నిధులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి రెండు విడతల్లో రూ.5000, చివరి విడత రూ.4000 అందించనుంది. కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.6000, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.14000.. కలిపి 20 వేల రూపాయల మొత్తాన్ని అందించనున్నారు అన్నమాట. మొత్తానికి అయితే అన్నదాత సుఖీభవ పథకం విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది. రేపే రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. తప్పులు సరి చేసుకునే ఛాన్స్.. ఇప్పటికే సచివాలయాల్లో అర్హులైన రైతుల జాబితాను ప్రదర్శించారు. అయితే కొంతమంది రైతులు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. వారికి మరోసారి అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈరోజు సాయంత్రం వరకు తప్పులు సరి చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. ముఖ్యంగా ఆధార్( Aadhar) వివరాలు సరిగ్గా లేకపోవడంతో చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. లక్షల మంది రైతుల ఆధార్ కార్డు వివరాలు వెబ్ ప్లాంట్ లో ఉన్న వివరాలతో సరిపోలడం లేదు. పేర్లు తప్పుగా ఉండడం.. చనిపోయిన వారి పేర్లు తొలగించకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అన్నదాత సుఖీభవ పథకం అర్హులైన రైతులు నష్టపోకుండా చూడాలని సూచించింది. రైతుల వివరాల్లో తప్పులు ఉండడంతో తహసీల్దారుల లాగిన్లలో చాలా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ సాయంత్రం లోగా వాటిని క్లియర్ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సందేహాల నివృత్తికి టోల్ ఫ్రీ.. అన్నదాత సుఖీభవ( Annadata Sukhi Bhava ) పథకం గురించి సందేహాల నివృత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం 115 251 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా తెలుస్తోంది. ఆగస్టు 2న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సచివాలయం వద్ద అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కార్యక్రమం నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏ రైతు కూడా అన్నదాత సుఖీభవ పథకం వర్తించలేదని బాధపడేలా చేయవద్దని.. వారి సమస్యలను క్షుణ్ణంగా పరిష్కరించి నిధులు జమ అయ్యే ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. రైతులకు కూడా తమ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని సూచించింది.
Latest News
01 Aug 2025 15:53 PM
1
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.