

No.1 Short News
Newsreadమాధవ్.. ముందు జిన్నా టవర్ చరిత్ర తెలుసుకుని మాట్లాడు..గులాం రసూల్
బీజేపీ నేత మాధవ్ పై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ హాట్ కామెంట్స్
రెండు రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గుంటూరు వేదికగా ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా వివాదస్పద వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు..
గుంటూరులోని జిన్నా టవర్ పేరు మారుస్తా అంటూ చేసిన వ్యాఖ్యలు బాధాకరం..
మాధవ్ ముందు జిన్నా చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుటుంది..
కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు..
స్వాతంత్ర్య కోసం చేసిన పోరాటంలో అనేక పోరాటాలు చేసి అక్రమ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని జిన్నా బయటకు తీసుకువచ్చారు..
వైసీపీ ప్రభుత్వంలో అన్ని మతాల పెద్దలను పిలిచి వివాదాలకు తావు లేకుండా జిన్నా టవర్ వద్ద జాతీయ చిహ్నాన్ని ఎగరవేయడం జరిగింది..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి లేదంటే గుంటూరు మిర్చి ఘాటు చూపిస్తాం..
బీసీ కులానికి చిందిన రమేష్ యాదవ్ పై దాడులు జరిగితే ఆ విషయాన్ని పట్టించుకోలేదు.. కనీసం ఖండించలేదు..
అసలు గాడ్ సే ని ప్రేమించేది బీజేపీనే..
ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిలో 70 శాతం ముస్లింలు ఉన్నారు..
దేశంతో పాటు గుంటూరు జిల్లాలో అనేక బ్రిటిష్ కట్టడాలు ఉన్నాయి, వాటిని కూడా కలుస్తారా..? బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి.. అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులకు గుర్తుగా దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా గేట్ పై స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల పేర్లను లిఖించటం జరిగిందని వాటిలో అధిక శాతం ముస్లిం వీరుల పేర్లే ఉన్నాయని వాటిని కూడా దమ్ముంటే కూల్చి చూపించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆబిద్ మహమూద్ మాజీ కార్పొరేటర్ అప్సర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సైదా మిర్చి యార్డ్ మాజీ డైరెక్టర్ మున్వాగ్ లీగల్ సెల్ నెంబర్ లియాకత్ అలీ వైఎస్ఆర్సిపి సీనియర్ మైనార్టీ నాయకులు ఫిర్దోస్ అహ్మద్ గార్లు తదితరులు పాల్గొన్నారు.
Latest News
07 Aug 2025 20:24 PM