

No.1 Short News
Newsreadనారా బ్రాహ్మణి తో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
మంగళగిరి గోలి వారి వీధిలో బుధవారం లక్ష్మీ శారీస్ వారి చేనేత వస్త్ర దుకాణాన్ని గౌరవ శ్రీమతి నారా బ్రాహ్మణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణి తో పాటు మన దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు ఆనాడు ఎన్నికల్లో మన యువ నేత మనస్పూర్తి ప్రదాత నారా లోకేష్ మాట నిజం చేస్తున్నారు.
చేనేత పరిశ్రమను ఆదుకునేందుకు దేశ విదేశాలలో మంచి గుర్తింపు తెచ్చేందుకు విస్తృత మార్కెటింగ్ ప్రభుత్వ సహాయంతో ముందుకు తీసుకు వెళుతున్నారు. అందులో భాగంగా నేడు మంగళగిరిలో శ్రీమతి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి చేనేత వస్త్ర దుకాణాన్ని ప్రారంభించి చేనేతలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
మరోసారి మన మంచి ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ స్పష్టం చేశారు. శ్రీమతి బ్రాహ్మణి కి డాక్టర్ లక్ష్మీ అభినందనలు తెలిపారు. నూతనంగా ప్రారంభించిన చేనేత వస్త్ర దుకాణంలో శారీని కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించారు.
ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మహిళా నేతలు మంగళగిరి కూటమి నాయకులు పెద్దలు అనేకమంది పాల్గొన్నారు.