

No.1 Short News
Newsreadపారిశుద్ధ్యం పట్ల అప్రమత్తత తో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గురువారం దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి పట్టణంలోని సందువారిపాలెం లో పర్యటించి. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని డ్రైన్లు పారిశుద్ధ్యం మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలు సంబంధిత మున్సిపల్ అధికారులను కోరారు. కాలువల్లో ఎప్పటికప్పుడు మురుగును తీయాలని వర్షాల ను దృష్టిలో ఉంచుకొని కాలువలో నీరు నిలబడకుండా చూడాలని పారిశుధ్య పట్ల అప్రమత్తం చేయాలని కోరారు. లేనట్లయితే నీళ్లు నిలబడి మురికిగా ఏర్పడి ప్రజలు రోగాలను భారీ పడే అవకాశం ఉందని ఆమె సూచించారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి అంచనాలు రూపొందించి నిర్మాణానికి ప్రభుత్వానికి నివేదికలు పంపాలన్నారు అదేవిధంగా తాగునీటి సమస్య తలెత్తకుండా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రజలు కోరిన విద్యుత్ పోల్స్ వెంటనే నిర్మించాలని సంబంధిత విద్యుత్ శాఖను డాక్టర్ లక్ష్మి ఆదేశించారు.
ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ దర్శి పట్టణంలో పారిశుద్ధ్యనికి అధిక ప్రాధాన్యత నివ్వాలని వారం వారం పట్టణంలో తాను పర్యటిస్తానని తెలిపారు. ప్రతి వార్డులో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని ప్రజల ఆరోగ్యమే సమాజ ఆరోగ్యమని ఆమె వివరించారు. వర్షాల సీజన్లో జ్వరాలు వచ్చే అవకాశం కూడా ఉందని సంబంధిత అధికారులు బ్లీచింగ్ చల్లి ఫ్లోర్నేషన్ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు కూడా అప్రమత్తతో వ్యవహరించి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వేడి నీళ్లను మంచినీరుగా తాగాలని తద్వారా ఆరోగ్యాలను పరిరక్షించుకోవాలని ఆమె ప్రజలను కోరారు. మున్సిపల్ అధికారులు వార్డులో నిత్యం పర్యటిస్తూ పారిశుద్ధ్య సిబ్బందిని అప్రమత్తం చేయాలని ఆమె ఆదేశించారు. ఈ పర్యటనలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తో పాటు మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, మున్సిపల్ కమిషనర్ మహేష్ ఇతర సిబ్బంది మరియు దర్శి పట్టణ టిడిపి అధ్యక్షులు చిన్న, టిడిపి నాయకులు యస్. వి. రామయ్య, కర్ణ శ్రీను, వాసు తదితర సందువారిపాలెం టిడిపి నాయకులు, మహిళలు ఉన్నారు.