No.1 Short News

Newsread
దర్శి లో స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన డా|| గొట్టిపాటి లక్ష్మి
దర్శి గడియార స్థంభం వద్ద శనివారం సాయంత్రం స్త్రీ శక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో డా గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు.అనంతరం స్త్రీ శక్తి ఉచిత ఆర్టీసీ బస్ లో మహిళలను ఉత్సహ పరుస్తూ అందరితో సరదాగా మాట్లాడుతూ దర్శి నుండి శంకరాపురం గ్రామం వరకు ప్రయాణం చేసారు. ఈ సందర్భంగా డా లక్ష్మీ మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం మహిళలలో మరింత భరోసా పెంచుతుందన్నారు.మహిళలకు ఆర్ధికంగా ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ఎంతో మేలు చేస్తుందన్నారు. స్త్రీ శక్తి పథకం వల్ల ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగాలు చేసుకునే మహిళలు స్వయం ఉపాధి చేసుకునే మహిళా శ్రామికులు పై భారం తగ్గుతుందన్నారు. కనీసం నెలకు ఒక్కొక్క మహిళ 1500 నుండి 2000 వరకు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మన ప్రభుత్వం సూపర్ సిక్స్ లో ప్రతి పథకాన్ని అమలు చేసి ప్రజా ప్రభుత్వంగా ముందుకు వెళుతుందన్నారు. టిడిపి అంటేనే మహిళలను గౌరవించే పార్టీ ఆనాడు ఎన్టీఆర్ ఈనాడు మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు మహిళల సాధికార కోసం ఆస్తిలో సమాన హక్కు కోసం అనేక చట్టాలను తెచ్చిన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. మహిళల కోసం ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలలవుపే సూపర్ సిక్స్ పథకంలో ఒకటైన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని నిన్న మహిళలకు అంకితం చేసి మహిళలకు ఆనందాన్ని కలిగించారు. దాదాపు ఈ పథకానికి 1950 కోట్లు ఖర్చు చేస్తూ మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణాన్ని పల్లె వెలుగులతో పాటు ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా వీటిని అమలు చేస్తున్నారు. అయితే మహిళలు భద్రతతో జాగ్రత్తలు వహిస్తూ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని డా లక్ష్మి కోరారు.మన అవసరాలకు సరిపడా ఆర్టీసీ బస్సులను వినియోగించుకుని మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలని కోరారు. ప్రజా కూటమి ప్రభుత్వాన్ని మహిళలందరూ ఆదరించి జేజేలు పలకాలి అని పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో అక్క చెల్లి తల్లి అందరూ చంద్రన్నను కుటుంబ పెద్దగా చూస్తున్నారని ఈ పథకం ఒక స్వర్ణాంధ్ర పథకంగా ఆమె కొనియాడారు.
Latest News
16 Aug 2025 20:13 PM
2
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.