

No.1 Short News
Newsreadప్రకాశం జిల్లా మానవత స్వచ్ఛంద సేవాసంస్థ ప్రధాన కార్యదర్శిగా కపురం శ్రీనివాసరెడ్డి.
ఈరోజు పొదిలి లోని మానవత స్వచ్ఛంద సేవాసంస్థ నూతన కార్యాలయ భవన ప్రారంభోత్సవానికి మానవత సంస్థ వ్యవస్థాపకుడు ఎన్.రామచంద్రారెడ్డి విచ్చేసిన శుభసందర్భంలో భాగంగా.., ప్రకాశం జిల్లా మానవత స్వచ్ఛంద సేవాసంస్థ నూతన కార్యవర్గ సభ్యులచే సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో,ఇప్పటివరకు దరిశి మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ గా పనిచేస్తున్న కపురం శ్రీనివాసరెడ్డిని ప్రకాశం జిల్లా మానవత సంస్థకు ప్రధాన కార్యదర్శిగా, జిల్లాలోని 10 శాఖల మానవతా మూర్తులందరిచేత ఏకగ్రీవంగా ఎన్నుకోబడి ఈరోజు కపురం శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..., సేవ చేయాలన్న ఆలోచన బలంగా వుండబట్టే సుధీర్గ రాజకీయాలను సైతం పూర్తిగా వదులుకొని ఈ సంస్థచెంతకు రావడం జరిగిందని, సేవ చేస్తే దేనిలోదక్కని ఆత్మసంత్రుప్తి దీనిలో దొరుకుతుందని, మానవుని ఆయుష్ పెరుగుతుందని కపురం శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రసంగించారు.
Local Updates
17 Aug 2025 17:59 PM