

No.1 Short News
Newsreadప్రజల ఆరోగ్యమే మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. డా|| గొట్టిపాటి లక్ష్మి.
ఈ రోజు దర్శి నియోజకవర్గంలోని 85 మంది పేద మరియు అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు మొత్తం ₹50,42,669 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను దర్శి లోని డా|| గొట్టిపాటి లక్ష్మీ నివాసం వద్ద దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ చేతుల మీదుగా అందజేశారు.
ప్రతి అనారోగ్య బాధితుడికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసిన డా|| గొట్టిపాటి లక్ష్మీ.
ఈ కార్యక్రమంలో దర్శి, దొనకొండ, ముండ్లమూరు, తాళ్లూరు మండల పార్టీ అధ్యక్షులు మరెళ్ల వెంకటేశ్వర్లు, మోడీ ఆంజనేయులు, కూరపాటి శ్రీను, మేడగం వెంకటేశ్వరరెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్నా, నియోజకవర్గం టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కూటమి శ్రేణులు ఉన్నారు.