

No.1 Short News
Newsreadదర్శి లో హోరెత్తిన మహిళాలోకం..ఆకట్టుకున్న గొట్టిపాటి లక్ష్మి ప్రసంగం
స్త్రీ - శక్తి పథకం విజయోత్సవ సభకు దర్శి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి మహిళలు వేలాదిగా తరలివచ్చారు. ఎంతో ఉత్సాహపూరిత వాతావరణం లో మహిళలు చేయి చేయి కలిపి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారికి అభినందనలు తెలుపుతూ నారీ లోకం శక్తి పథకానికి జేజేలు పలికారు. ఆర్ అండ్ బి బంగ్లా ప్రాంగణమంతా మహిళలతో కిక్కిరిసిపోయింది. కనీవిని ఎరుగని రీతిలో మహిళా స్త్రీ శక్తి ఏమిటో నిరూపించారు. నారీ లోకం దర్శికి కదులుచింది. మహిళలు దండుగా చంద్రన్నకు అండగా కూటమి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్నామంటూ నినదించారు. కొందరు మహిళా నాయకుల ప్రసంగాలు ఆసక్తిగా మారాయి. మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రసంగాన్ని మహిళలందరూ అధ్యంతం ఆసక్తిగా విన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున హాజరైన మహిళామ తల్లులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
Latest News
26 Aug 2025 14:57 PM