No.1 Short News

P.Prakash
అవనిగడ్డ: నిస్సహాయ మహిళకు సర్పంచ్ ఉమా చేయూత.
షుగర్ వ్యాధితో బాధపడుతూ రెండు కాళ్లు తొలగించాల్సిన దుస్థితికి చేరిన నిర్భాగ్యురాలికి అవనిగడ్డ సర్పంచ్ గొరుముచ్చు ఉమా 5000 ఆర్థిక సహాయం అందించారు. మోపిదేవి ప్రశాంత్ నగర్ కు చెందిన కాకి నాగమణి, నివాసం వద్ద బుధవారం ఆమెను పరామర్శించి అండగా నిలిచారు, చచ్చు బడిన కాళ్ళు తొలగించేందుకు అవసరమైన వైద్య ఖర్చుల నిమిత్తం చేతిలో చిల్లిగవ్వ లేక దాతల సాయం కోరుతున్నారని సోషల్ మీడియాలో వచ్చిన వార్తకు స్పందించి తామ వంతుగా ఈ ఆర్థిక సాయం అందించినట్లు ఉమా తెలిపారు. మానవతా దృక్పథంతో దాతలు అందిస్తున్న సహకారానికి నాగమణి, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బర్త గొరుముచ్చు మోని, ఉప సర్పంచ్ కోడూరు సత్యనారాయణ, పాల్గొన్నారు.
Local Updates
24 Jan 2025 21:02 PM
1
30