No.1 Short News

P.Prakash
చల్లపల్లి:ఆర్టీసీ కార్గో సేవలు సద్వినియోగం చేసుకోవాలి డి పి టి ఓ వాణిశ్రీ
చల్లపల్లి బస్టాండ్ లో ఆర్టీసీ కార్గో సేవలను చుట్టుపక్క గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజా రవాణా అధికారిణి వి. వాణిశ్రీ కోరారు. శుక్రవారం చల్లపల్లి బస్ స్టేషన్ లోని ఆర్టీసీ కార్గో కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చల్లపల్లి, చుట్టుపక్కల గ్రామాల ప్రజల సౌకర్యార్థం చల్లపల్లి ఆర్టీసీ బస్టాండులో ఆర్టీసీ కార్గో, కొరియర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన, వేగవంతమైన సేవలు ఆర్టీసీ కార్గో, కొరియర్ ద్వారా అందిస్తున్నమన్నారు. వ్యాపార సంస్థల యజమానులు, గ్రామ ప్రజలు ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలని కోరారు.
Local Updates
24 Jan 2025 21:03 PM
1
39