No.1 Short News

P.Prakash
గోగినేనిపాలెం జడ్పీ హైస్కూల్ లో జాతీయ బాలిక దినోత్సవం
గోగినేని పాలెం జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు తమ్మన వేణుగోపాలరావు ఆధ్వర్యంలో గ్రామ ఆరోగ్య సిబ్బంది అంగనవాడి సిబ్బంది సంయుక్తంగా జాతీయ బాలికా దినోత్సవం కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్థినీల సమక్షంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సమాజంలో లింగ వివక్షత విడనాడాలని బాలురతో పాటుగా బాలికలు కూడా చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందుండాలని ప్రధానోపాధ్యాయులు అన్నారు. బాలికలు ఇబ్బందుల నుండి ఎలా రక్షణ పొందాలో వివరించారు.
Local Updates
25 Jan 2025 09:54 AM
0
33