No.1 Short News
Newsread పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకే నామినేటెడ్ పోస్టులు.. పార్టీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు
ఐదేళ్లపాటు కార్యకర్తలు చేసిన తిరుగులేని పోరాటమే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘన విజయానికి కారణమని ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, మొదటి నుంచీ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 214 మార్కెట్ కమిటీలు, 1,100 దేవాలయాల ట్రస్ట్ బోర్డుల్లో నియామకాలతో పాటు అన్ని నామినేటెడ్ పోస్టులను వచ్చే జూన్ లోగా భర్తీ చేస్తామని చెప్పారు.
Latest News
29 Jan 2025 11:32 AM