No.1 Short News

Newsread
తెలంగాణ సెక్రటేరియట్ లో ఇద్దరు నకిలీ ఉద్యోగులు
సెక్రటేరియట్ లో ఇటీవల నకిలీ ఉద్యోగులు తిరుగుతున్నారని భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. దీంతో నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ శాఖ.. మంగళవారం ఇద్దరు నకిలీ ఉద్యోగులను అదుపులోకి తీసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్ రావు, డ్రైవర్ రవి ఫేక్ ఐడీ కార్డులు తయారుచేసి సెక్రటేరియట్ లో దందా చేస్తున్నారు.సెక్షన్ ఆఫీసుల్లో తిరుగుతూ అక్కడికి వచ్చిన వారిని మాటల్లో పెట్టి వివరాలు రాబడుతున్నారు. వారి పని పూర్తిచేయిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నారు. నకిలీ ఉద్యోగుల సమాచారంతో అప్రమత్తమైన సచివాలయ భద్రత సిబ్బంది నకిలీ ఉద్యోగులు ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Latest News
30 Jan 2025 12:42 PM
1
25