No.1 Short News

Newsread
ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా హరీష్ కుమార్ గుప్తాను ప్రభుత్వం నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సీఎస్ విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. డీజీగా ఉన్న గుప్తా 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఎన్నికల సమయంలోనూ డీజీపీగా వ్యవహరించారు గుప్తా. 2025 ఆగష్టులో పదవీ విరమణ పొందేవరకు హరీష్ కుమార్ గుప్త డీజీపీగా కొనసాగనున్నారు.
Latest News
30 Jan 2025 13:03 PM
1
29