ఒక ఫెయిల్యూర్ & అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి చంద్రబాబు - బూచేపల్లి హాట్ కామెంట్స్
గురువారం మధ్యాహ్నం ఒంగోలు లో జరిగిన మీడియా సమావేశం లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై బూచేపల్లి విమర్శలు గుప్పించారు. చరిత్ర లో చంద్రబాబు ఒక ఫెయిల్యూర్, అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి గా మిగిలిపోనున్నారని, పవన్ కళ్యాణ్ ఎన్నికల కు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, మీరు కాపులకు ఇచ్చిన హామీ ఒక్కటైనా చేశారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కూటమి నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.