

No.1 Short News
T Maheshముఖ్యమంత్రి చంద్రబాబు ని కలిసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి
ముఖ్యమంత్రి చంద్రబాబు ని కలిసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ
రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శింగనమల నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు అభివృద్ధి పనులు గురించి తెలియజేశారు. ముఖ్యంగా రైతులకు సాగునీటి ని అందించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి కృతజ్ఞతలు తెలిపారు. శింగనమల నియోజకవర్గ పరిధిలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరిస్తూ,అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు.
ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు బాగా కృషి చేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
Politics
31 Jan 2025 06:47 AM