No.1 Short News
T Maheshపొలం పనుల్లో రఘువీరారెడ్డి
మంత్రి, పీసీసీ చీఫ్ గా పనిచేసి ప్రజలందరికీ సుపరిచితులైన రఘువీరారెడ్డి పొలం పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. మడకశిర మండలం నీలకంఠాపురంలోని తన పొలంలో రైతుగా మారారు. పంటలోని కలుపు మొక్కలను యంత్రంతో స్వయంగా తొలగించారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ సమయం దొరికినప్పుడు సామాన్యుడిలా జీవనం కొనసాగిస్తూ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇటీవల ఆయన ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సాగించారు.
Local Updates
31 Jan 2025 10:39 AM