No.1 Short News

T Mahesh
బిజెపి గెలుపు
ఢిల్లీలో తెలుగువాళ్లు ఉన్న పలు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హస్తినలో బీజేపీ గెలుపు దేశ ప్రగతికి మలుపు అని చెప్పారు. సరైన సమయంలో దేశాన్ని సరైన నాయకుడు పాలిస్తున్నారని, మోదీ పాలనలో ప్రపంచంలో భారత్ పేరు మార్మోగుతోందని వెల్లడించారు. ఢిల్లీ ప్రజలు సరైన గాలి పీల్చాలంటే మోదీ పాలనతో ఆక్సిజన్ ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయని AAP ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ ప్రచార కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఢిల్లీ ఎన్నికల ఇన్చార్జ్ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు
Latest News
03 Feb 2025 09:34 AM
0
13