No.1 Short News

Shaida
చ‌రిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి
ఇంగ్లండ్‌తో స్వ‌దేశంలో జ‌రిగిన టీ20 సిరీస్ ద్వారా టీమిండియా మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి చ‌రిత్ర సృష్టించాడు. ఈ ఐదు మ్యాచుల సిరీస్‌లో 14 వికెట్లు తీసిన అత‌డు.. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన స్పిన్న‌ర్‌గా రికార్డుకెక్కాడు. 33 ఏళ్ల భార‌త స్పిన్న‌ర్ ఈ సిరీస్ చివరి గేమ్‌లో 25 ప‌రుగులిచ్చి, 2 వికెట్లు తీశాడు. తద్వారా ఐదు మ్యాచుల‌ సిరీస్‌లో 14 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు.
Sports News
03 Feb 2025 11:42 AM
1
19