No.1 Short News
Newsreadహిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకున్న టీడీపీ
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో టీడీపీ జోరు మరింత పెరిగింది. తాజాగా హిందూపూర్ మున్సిపల్ ఛైర్మన్ పదవిని తెలుగుదేశం కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్ గా రమేశ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రమేశ్ ను హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ అభినందించారు. రమేష్ ను ఛైర్మన్ సీట్లో బాలయ్య కూర్చోబెట్టారు. ఈ రోజు నిర్వహించిన ఓటింగ్ లో టీడీపీకి అనుకూలంగా 23 ఓట్లు వైసీపీ అభ్యర్థి వెంకటలక్ష్మికి 14 ఓట్లు పడ్డాయి. ఓటింగ్ లో ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి కూడా పాల్గొన్నారు.
Local Updates
03 Feb 2025 11:56 AM