No.1 Short News

Shaida Reporter
తాడిపత్రిలోని నా ఇంటికి వెళ్లడానికి కూడా వీసా కావాలా? జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చగొడుతున్నారు: పెద్దారెడ్డి
తాడిపత్రిలోని తన ఇంటికి పోలీసులు వెళ్లనివ్వడం లేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తన ఇంటికి వెళ్లడానికి కూడా వీసా తీసుకోవాలా? అని ఆయన ప్రశ్నించారు. వీసా ఆఫీస్ ఎక్కుడుందో చెపితే అక్కడకు వెళ్లి అప్లై చేసుకుంటానని ఎద్దేవా చేశారు. తాడిపత్రికి వెళ్లడానికి కేతిరెడ్డి ఏర్పాట్లు చేసుకోగా... అక్కడకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందని చెప్పిన పోలీసులు... పెద్దారెడ్డిని యల్లనూరు మండలంలోని తిమ్మంపల్లిలోని నివాసంలో గృహనిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలోనే పెద్దారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
Politics
03 Feb 2025 13:23 PM
1
16