No.1 Short News
Ai With SAiశంకర్ దాదా MBBS సినిమా స్టైల్ లో రాత్రికి రాత్రే ఆసుపత్రి మార్పు
శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో లాగా రాత్రికి రాత్రే ప్రభుత్వ హాస్పిటల్ పేరు మార్పు!
కొడంగల్ మెడికల్ కాలేజ్ కోసం తాండూరు ఆసుపత్రికి కొడంగల్ పేరు
ఇదేం విచిత్రం అంటూ ఫ్లెక్సీ చింపేసిన స్థానికులు
వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి కొడంగల్ జనరల్ ఆసుపత్రిగా పేరు మారుస్తూ సోమవారం రాత్రి ఫ్లెక్సీ కట్టడంతో కలకలం
ప్రవేశద్వారానికి ఉన్న బోర్డుపై 'ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి- కొడంగల్' అంటూ ఫ్లెక్సీ కట్టడాన్ని నిలదీసిన స్థానికులు
ఆసుపత్రి వర్గాల నుంచి సరైన సమాచారం లేకపోవడం, ఫ్లెక్సీ కడుతున్న గుత్తేదారు దురుసుగా మాట్లాడడంతో స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని ఫ్లెక్సీని చించేశారు
ఇదీ అసలు కథ
గత ప్రభుత్వంలో జిల్లాకో మెడికల్ కాలేజ్ నిర్మాణంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి తన సొంత నియోజవర్గం కొడంగల్ కు మార్చుకున్నారు.
దీనికి అనుబంధంగా 220 పడకల ఆసుపత్రిని చూపించాల్సి ఉండగా మరో వారంలో ఢిల్లీ నుంచి జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) బృందం కొడంగల్ కు తనిఖీ నిమిత్తం రానుంది.
వారికి చూపించేందుకు తాండూరులోని 200 పడకల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి పేరును కొడంగల్ జనరల్ ఆసుపత్రిగా మారుస్తూ సోమవారం రాత్రి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. -news credit's by Telugu Scribe
Breaking News
04 Feb 2025 10:29 AM