

No.1 Short News
Shaida Reporter బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషాకు మరిన్ని చిక్కులు.. మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య వ్యవహారంలో బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషా చేసిన ఆరోపణలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. డబ్బు కోసమే లావణ్య ఇదంతా చేస్తోందని శేఖర్ బాషా ఆరోపించాడు. ఈ క్రమంలో శేఖర్ బాషాపై లావణ్య కేసు పెట్టింది. ఓవైపు ఇది జరుగుతుండగానే... బాషాపై మరో కేసు నమోదయింది.శేఖర్ బాషాపై మహిళా అసిస్టెంట్ కొరియాగ్రాఫర్ శ్రేష్టి వర్మ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు పెట్టింది కూడా శ్రేష్టి వర్మ కావడం గమనార్హం.
Entertainment
06 Feb 2025 18:11 PM