

No.1 Short News
Shaida Reporter మంత్రులు స్లోగా ఉంటే కుదరదు... ఎవరినీ ఉపేక్షించను: సీఎం చంద్రబాబు
ఏపీ క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో మాట్లాడారు. మంత్రుల పనితీరు మెరుగుపడాలని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి 6 నెలలు రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవడంపైనే దృష్టి కేంద్రీకరించానని, మంత్రుల పనితీరు గురించి పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. కానీ ఇకపై మంత్రుల పనితీరుపై ఫోకస్ పెడతానని, ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
మంత్రులు నిదానంగా ఉంటే కుదరదని, గేర్లు మార్చి ముందుకు వెళ్లాలని అన్నారు. మంత్రుల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక, మంత్రులు ఆప్కోస్ ద్వారా కాకుండా... శాఖల వారీగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకోవచ్చని సూచించారు.
Politics
06 Feb 2025 18:10 PM