

No.1 Short News
Shaida Reporter ఢిల్లీలో గెలుపు దిశగా బీజేపీ.. చంద్రబాబు ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో బీజేపీ ముందంజ!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పూర్తి ఆధిక్యత దిశగా బీజేపీ దూసుకుపోతోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆప్ ను ఓటర్లు పక్కన పెట్టేశారు. మొత్తం 70 స్థానాల్లో 45 స్థానాల్లో బీజేపీ ఆధిక్యతలో ఉంది. ఆప్ 24, కాంగ్రెస్ 1 స్థానంలో లీడింగ్ లో ఉన్నాయి. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది.
మరోపైపు ఎన్డీయే భాగస్వామిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు.
Politics
08 Feb 2025 10:40 AM