No.1 Short News

Shaida Reporter
ఢిల్లీ ఫలితాల ట్రెండ్ పై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దూసుకుపోతుండడంపై జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ పార్టీల అగ్ర నాయకత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ‘మీలో మీరు మరింత పోట్లాడుకోండి, ఒకరినొకరు ఓడించుకోండి’ అంటూ ఎద్దేవా చేశారు. ఈమేరకు ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆప్ తో పాటు పలు ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ కూటమిలోని పార్టీల్లో విభేదాలు పొడసూపాయి.
Politics
08 Feb 2025 10:49 AM
1
55