No.1 Short News

Shaida Reporter
రామ్ గోపాల్ వర్మకు మరో కేసులో నోటీసులు ఇచ్చిన ఏపీ సీఐడీ
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను వరుస కేసులు వెంటాడుతున్నాయి. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లను కించపరుస్తూ పెట్టిన పోస్టులకు సంబంధించిన కేసులో నిన్న పోలీసు విచారణకు ఆయన హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మను దాదాపు 9 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. ఇదే సమయంలో వర్మకు మరో కేసులో ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు నోటీసులు అందజేశారు. ఈ నెల 10న గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Entertainment
08 Feb 2025 12:16 PM
0
50