No.1 Short News

Shaida Reporter
అత‌డిని ఎక్కువ రోజులు సైలెంట్‌గా ఉంచ‌లేరు.. రోహిత్‌పై సూర్య‌, పాండ్యా, యువీ ప్ర‌శంస‌లు!
క‌ట‌క్ వేదిక‌గా ఇంగ్లండ్ తో జ‌రిగిన రెండో వ‌న్డేలో భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. 76 బంతుల్లో సెంచ‌రీ బాదిన‌ అత‌డు.. మొత్తంగా 90 బంతుల్లో 119 ప‌రుగులు చేశాడు. రోహిత్ ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 7 సిక్స‌ర్లు న‌మోదు కావ‌డం విశేషం. ఈ క్ర‌మంలోనే అత‌నిపై తోటి ఆట‌గాళ్లు సూర్య‌కుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్య, మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌త్యేకంగా పోస్టులు పెట్టారు.
Sports News
10 Feb 2025 10:03 AM
0
22