No.1 Short News

Umar Fharooq
రంగరాజన్ పై దాడిని ఖండిస్తున్న చంద్రబాబు
హైదరాబాదులోని చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై రామరాజ్యం సంస్థ సభ్యులు దాడి చేయడం జరిగింది. ఆలయానికి వచ్చే భక్తులను తమ సంస్థలో చేర్చాలని రామరాజ్యం వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డి కోరగా, రంగరాజన్ అందుకు నిరాకరించారు. దాంతో రామరాజ్యం సభ్యులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. చిలుకూరు ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ పై దాడి హేయమని, దీన్ని తాను ఖండిస్తున్నానని తెలిపారు.
Latest News
11 Feb 2025 22:38 PM
0
23